Podagantimayya Mimmu Purushottama Mammu
Nedayakavayya koneti Raayada
Korimammu nelinatti kuladaivama, chala
Nerichi peddalichina nidhanama
Gaaravinchi dappi deerchu kaala meghamaa, maaku
Cheruva chittamuloni Srinivasudaa
Bhavimpa kaivasamaina Paarijatamaa, mammu
Chevadera gaachinatti Chintamani
Kaavinchi korikalicche Kamadhenuva, Mammu
Taavai rakshincheti Dharanidhara
Chedaneeka bratikinche Siddhamantrama,
Om Namo Venkatesaya....
Rogaa ladachi rakshinche divyaushadama
Badibaayaka tirige Pranabandhudaa, mammu
Gadiyinchinatti Sri Venkatanadhudaa
Lyrics in Telugu:
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము|
నెడయకవయ్య కోనేటి రాయడా||2||
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల|
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా|
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు|
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా||
భావింప కైవసమైన పారిజాతమా, మమ్ము|
చేవదేర గాచినట్టి చింతామణీ|
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము|
తావై రక్షించేటి ధరణీధరా||
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా|
లడచి రక్షించే దివ్యౌషధమా|
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము|
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా||
Comments
Post a Comment