Skip to main content

Bhogi Pallu Procedure in Telugu / భోగి పళ్లు పోయు విధానం || Bhogi Panduga Date 2024

Bhogi Panduga Date 2024: Sunday 14th January 2024

భోగి - సంక్రాంతి మన తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగలు. సూర్యుడు ధనుష్ రాశి నుంచి మకర రాశి లో ప్రవేశించిన time ని ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. ఆ రోజే మనకి మకర సంక్రాంతి పండుగ.

మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి మరుసటి రోజున కనుమ, ఆ మరుసటి రోజు ముక్కనుమ జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లో భోగి / సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు . సంక్రాంతి సంబరాలు December నుంచే మొదలౌతుంది.
భోగి రోజున సూర్యోదయం కాక ముందే, అందరు ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుంటారు. అలా భోగి మంటల తో పండుగ సందడి మొదలౌతుంది. చిన్న పిల్లలకి, అంటే ఐదేళ్ల లోపు పిల్లలకి, సాయంత్రం సూర్యాస్తమం కాకముందే భోగి పళ్లు పోస్తారు. ఐదేళ్లు దాటిన పిల్లలికి కూడా భోగి పళ్లు పోస్తారు / పోయచ్చు. అసలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటె, అందరిని కూర్చో పెట్టి ఒకే సారి అందరికి భోగి పళ్లు పోయవచ్చు. ఇది ఒక వేడుక మాత్రమే. ప్రాంతాలు / జిల్లాలను బట్టి వేడుకలో చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు.

భోగి పళ్లు అంటే ఏంటి , ఇవి పిల్లలికి ఎందుకు పోస్తారు?

మన భారత దేశం లో December / January నెలలలో రేగి పండ్లు చాలా విరివిగా కాస్తాయి / దొరుకుతాయి. ఈ పండ్లకు చెడు దిష్టిని ఆకర్షించే శక్తి ఉందని అంటారు. చిన్న పిల్లలు, ముద్దు ముద్దు మాటలతో, అందిరిని ఆకర్షిస్తారు. ఆందరి కళ్లు వాళ్ళ పైనే ఉంటుంది. ఎవ్వరు కావాలని వాళ్ళకి దిష్టి పెట్టారు. ఐన ఊర్లో వాళ్ళ దిష్టి, ఇరుగు- పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా పిల్లలపైన, తెలియకుండానే పడుతుంది.

అలా తెలియకుండా పడ్డ చెడుదిష్టిని తీసేసే శక్తి రేగి పళ్లకి వుంది. అంతే కాకుండా భోగి పళ్లు, పిల్లలికి దిష్టి తగలకుండ కాపాడుతుంది అని మన కూడ నమ్మకం. అందుకే భోగి రోజున ఈ రేగి పండ్లను పిల్లల తల పైన పోస్తారు.

భోగి పళ్లు ఎలా చేస్తారు

కొమ్ము శెనగలు / kabuli chana ముందు రోజు రాత్రి నాన బెట్టి, భోగి రోజు పొద్దున నీళ్లను వడగట్టి పెట్టుకోవాలి. నానిన శెనగలు, రేగి పళ్ళు (విదేశాలలో ఉంటున్న వారు, అక్కడ దొరికే బెర్రీస్ తో భోగి పళ్లు చేసుకోవచ్చు ), చెరుకు గడ్డ (చిన్న చిన్న ముక్కలు), చేమంతి లేదా గులాబీ (విదేశాలలో ఉంటున్న వారు, అక్కడ దొరికే పువ్వులు తీసుకోవచ్చు ) రెక్కలు, రూపాయి బిళ్ళలు (విదేశాలలో ఉంటున్న వారు, అక్కడి currency coins) ఇంక అక్షింతలు ఒక పెద్ద ఇత్తడి లేదా steel గిన్నె / పళ్లెంలో పోసి కలిపి పెట్టుకోవాలి.

Note: పై వాటిలో ఏవైనా items లేకపోయినా పర్వాలేదు. Main గ రేగి పళ్లు, పువ్వులు, అక్షింతలు ఉంటే చాలు

భోగి పళ్లు పోసె విధానం

భోగి రోజు పొద్దున్న పిల్లలికి కుంకుడుకాయ లేదా షీకాయ (shampoo ఐన okay) తో తలంటు పొసి కొత్త బట్టలు వెయ్యాలి. ఇది మన తెలుగు వారి పండుగ కాబట్టి, ఆడ పిల్లలకు చక్కగా పట్టు పరికిణి జాకెట్టు తొడిగించి, జడని జడగంటలు / జడకుచ్చులు తో అల్లి, పువ్వులు పెట్టి, చక్కగ బొట్టు, కాటుక పెట్టి , చేతికి గాజులు (ఉంటె జబ్బ వంకీలు) తొడిగి, మెడలో హారం, కాళ్లకు మువ్వల పట్టిలు పెట్టి, వీలైతే కాళ్లకు పసుపు రాసి, ఎంచక్కగా అలంకరిస్తె, వాళ్ళు ఎంత ముద్దుగా అందంగా వుంటారో. వాళ్ళు అలా కాళ్లకు మువ్వల పట్టిలతో, ఘల్లు ఘల్లు మని ఇంట్లో తిరుగుతూ ఉంటే, సాక్షాత్ అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఇంట్లో తీరుగునట్లు ఉంటుంది. ఆ అందం నిజంగా ఇంకా ఏ అలంకరణ లో ఉండదు.

ఇంటిలో hall లేదా living room / drawing room లో తూరుపు దిక్కు కి ఎదురుగా ఒక కూర్చి వేసి దాని పై ఒక పట్టు చీర లేదా ఏదైనా clean cloth వేయాలి. పక్కనే ఒక side table పైన తెయారు చేసి ఉంచిన భోగి పళ్ల bowl ఉంచాలి. అలాగే, ఒక tray లో పసుపు, కుంకుమ ఇంక గంధం (చందనం) ఉంచాలి. హారతి పల్లెలో కర్పూరం రెడీగా పెట్టి ఉంచుకోవాలి. ఇంకొక side table పైన పేరంటానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం, వచ్చిన పిల్లలికి return gifts / goodie bags ముందుగానే రెడీగా అమర్చి ఉంచచాలి. అలా అన్ని రెడీ గా పెట్టుకొని ఉంటే, last minute హడావుడి / కంగారు లేకుండా ఉంటుంది.

సాధారణంగా భోగి పళ్లు సూర్యాస్తమం కాక ముందే పోస్తారు. అలాగని ఏదైనా కారణం వల్ల సూర్యాస్తమం లోపు పొయ్యలేక పొతే, కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగని ఊరికే late చెయ్యవద్దు. సూర్యాస్తమయం లోపు పొయ్యటం మంచిది.

చక్కగా తెమిలిచిన పిల్లని / పిల్లల్ని కుర్చీ పైన తూర్పుకి ఎదురుగా కూర్చో పెట్టాలి. ముందుగా మామ్మ (నాన్నమ్మ) లేదా అమ్మమ్మ ఇంట్లో ఉంటే, వాళ్ళ చేత చేయించటం మంచిది.
ముందుగా నుదుట కుంకుమ పెట్టి, మెడ కి గంధం పులిమి, తలపై అక్షంతలు వెయ్యాలి. ఆ తరువాత చేత్తో పిడికెడు భోగి పళ్లు తీసుకొని పాప / బాబు తలపై ముందుగా ఎడమవైపు నుంచి కుడివైపుకి తిప్పి తలపై పొయ్యాలి. మళ్లి మరో పిడికెడు భోగి పళ్లు తీసుకొని, రెడో సారి కుడి నుంచి ఎడమవైపు తిప్పి తలపై పళ్లు పొయ్యాలి. ఇంక మూడో సారి పిడికెడు భోగి పళ్లు తీసుకొని తలపై పొయ్యాలి.

ఇలా ముందుగా తల్లి / మామ్మ / అమ్మమ్మ భోగి పళ్లు పోసిన తరువాత, అక్కడ ఉన్న / వచ్చిన పెద్ద వాళ్లు ఒక్కొక్కరుగా వచ్చి పొయ్య వచ్చు.

ఇంక last కి మంగళ హారతి ఇవ్వాలి. ఉన్న ముత్తైదవులందరు హారతి పళ్లెం పట్టుకోవచ్చు. పాటలు వచ్చినవారు ఏదైన హారతి పాట పాడితే మంచిది. అంతా అయ్యాకా అందరికి తాంబూలాలు ఇవ్వాలి. Return gifts / goodie bags ఇవ్వాలి అనుకున్న వారు ఇవ్వొచ్చు. ఎవరి ఇష్టం లేదా affordability బట్టి వారు ఇచ్చుకో వచ్చు.

ఈ విధంగా భోగి పళ్లు పిల్లలికి దిష్టి తగలకుండ కాపాడుతుంది అని నమ్మకం. భోగి పళ్లు పోసాకా కింద పడ్డ పళ్లని, రూపాయి coins ను , మిగితా పిల్లలు తొక్కకుండా, తీసుకోకుండా చూసుకోవాలి. కిందపడ్డ పండ్లను, ఒక cover లో ఉంచి, పని అమ్మాయికి కానీ లేదా watchman / security person కానీ ఇవ్వొచ్చు.

Note: ఒక వేళ సూర్యాస్తమం లోపు పిలిచిన వారెవ్వరూ రాలేకపోతే, తల్లి లేదా మామ్మ / అమ్మమ్మ (ఇంట్లో ఉంటే) ముందుగా అన్ని కార్యక్రమాలు చేసి భోగి పళ్ళు పోయవచ్చు. తరువాత వచ్చిన వాళ్లు ఒక్కొక్కరు గా భోగి పళ్లు పొయ్యొచ్చు.

Note: ఇది చాలా మంది readers తెలుగు లో వ్రాయమని request చెయ్యగ వ్రాసినది. భాష లో తప్పులు ఉంటే మన్నించండి .

Comments

Contact Form

Name

Email *

Message *