Skip to main content

Sravana Mangala Vaaram Dates 2025 || Sravana Mangala Gowri Vratham Procedure in Telugu

శ్రావణ మంగళవారాలు Dates 2025
29th July - మొదటి మంగళవారం
5th August - రెండో మంగళవారం
12th Aug - మూడో మంగళవారం
19th Aug - నాల్గో మంగళవారం


శ్రావణ మాసం అంటే ముందుగా గుర్తు వచ్చేది వరలక్ష్మి వ్రతం మరియు మంగళ గౌరీ నోము / వ్రతం. శ్రావణ మంగళవారాలు గౌరీ దేవినీ
అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మి దేవినీ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

మంగళ గౌరీ వ్రతం

కొత్తగా పెళ్ళైన వధువులు భర్త క్షేమం కోసం శ్రావణ మాసం లో 4 / 5 మంగళవారాలు చేసుకునే వ్రతం మంగళ గౌరీ వ్రతం. ఈ వ్రతం పెళ్ళైన తరువాత వరుసగా అయిదేళ్లు పాటు చేసుకోవాలి. ఏదైనా ఒక మంగళవారం ఆటకం వచ్చి పూజ చెయ్యలేకపోతే, ఏమి పర్వాలేదు. మళ్లి వచ్చే మంగళవారం చేసుకోవచ్చు.

అలాగే అయిదేళ్లులో ఒకటి / రెండు ఏళ్ళు ఏ కారణం వల్లనైనా ఆటంకం వచ్చి ఈ వ్రతం చేసుకోలేక పోయినా పర్వాలేదు. మొత్తం మీద అయిదేళ్లు ఈ వ్రతం చేసుకోవాలి, వరుసగా కాకపోయినా పర్వాలేదు . ఆ తరువాత ఉద్యాపన చెయ్యాలి. అలాగే ఈ వ్రతం ఎవరి ఆచార సంప్రదాయాలను బట్టి వారు చేసుకోవాలి.

మంగళ గౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు

  • పసుపు, కుంకుమ, గంధం
  • శెనగలు వాయనానికి
  • తమలపాకులు, వక్కలు
  • పువ్వులు, పండ్లు
  • ఎరుపు / పసుపు / ఆకుపచ్చ blouse piece.
  • జ్యోతులకి బియ్యపిండి, బెల్లం
  • పంచామృతానికి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పాలతో చేసిన పెరుగు, తేనే, పంచదార
  • తోరానికి yellow / white thread
  • కాటుక పట్టటానికి (iron or stainless steel) అట్లకాడ / కత్తి
  • దీపారాధన నూనె, అగరొత్తులు
  • హారతి పళ్ళెం, గంట
  • పంచపాత్ర, ఉద్ధరిణి, అక్షంతలు
  • ఇంకా పూజకి కావలసిని మిగితా సామాగ్రి

మంగళ గౌరీ దేవిని అలంకరించే విధానం

అమ్మవారిని అలంకరించటం ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవాలి. కలశం, లేదా అమ్మవారి పటం పసుపు కుంకుమ పూలతో అలంకరించిన మండపం / పీట పై పెట్టుకోవాలి. అలంకరణ ఎవరి శక్తి కొద్దీ వారు చేసుకోవచ్చు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం ముఖ్యం.

కలశం / పటం ముందర పసుపు తో చేసిన అమ్మవారిని ఒక తమలపాకు పైన ఉంచి దాన్ని కలశం / పటం ముందర ఉంచాలి. పసుపు అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి పూలతో పూజ చెయ్యాలి ప్రతి మంగళవారం అదే పసుపు అమ్మవారిని పూజించాలి.

తోరం ఎలా చేసుకోవాలి?

White / yellow / chandan colour దారం 5 పోగులు (strands) తీసుకొని, దానికి తడి పసుపు రాయాలి. ఆ దారానికి 5 / 9 చోట్ల (ఆచారాన్ని బట్టి) చామంతి / గులాబీ పువ్వు పెట్టి ముడులు వేసి, కుంకుమ పెట్టాలి.అమ్మవారికి ఒక తోరం ((అదే అమ్మవారి పూజ చేసేవారు కట్టుకోవాలి), ముగ్గురు ముతైదువలకి మరియు కాటుక పట్టే అట్లకాడ / knife కి ఒకటి, మొత్తం 5 (or 9 ఆచారాన్ని బట్టి) తోరములు చెయ్యాలి.

వరిపింది జ్యోతులు ఎలా చెయ్యాలి?

ఒక bowl లో 5 small cups వరిపిండి తీసుకొని తగినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి వేసి కలపాలి. కావాలంటే elaichi powder కలుపోకోవొచ్చు. పిండిని గట్టి ముద్దలాగా కలపాలి. కావాలంటే చాలా కొంచెం నీళ్లు జల్లి కలపాలి. మరీ ఎక్కువ నీళ్లు పొయ్యకూడదు.

ముద్దని 5 ఉండలు చేసి, ఒక్కొక్క ఉందని చేతిలో తీసుకొని బొటాని వేలుతో మధ్యలో కొంచెం press చెయ్యాలి. ఆలా 5 పిండి జ్యోతులు చేసి ఒక రాగి / ఇత్తడి / పింగాణీ / steel పళ్లెం లో ఉంచి, వట్టిల్లో ఆవు నెయ్యి పోసి, వొత్తులుఉంచి, కుంకుమ బొట్టు పెట్టి మండపం దగ్గర ఒక పక్కాగా అందుబాటులో ఉంచుకోవాలి.
పూజ ఐన తరువాత వ్రత కధ చదివేముందర, జ్యోతులు వెలిగించి, కధ చదువుతూ అట్లకాడ వెలుగుతున్నజ్యోతులపై పట్టుకొని కాటుక పట్టాలి.

Download Telugu PDF of Mangala Gowri Vrata Vidhanam

పూజా విధానం

  1. ప్రార్ధన
    ముందుగా 'శుక్లాం బరధరం విష్ణుం' అను ప్రార్ధన తో పూజ ప్రారంభించాలి.
  2. దీపారాధన
    దీపారార్ధన చేసి (దీపం వెలిగించి), దీపానికి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వు ఉంచి, అక్షంతలు వేసి నమస్కరించాలి.
  3. ఆచమనం
  4. ప్రాణాయామంచేసి
  5. సంకల్పం చేసుకోవాలి. సంకల్పం తరువాత
  6. కలశారాధన చెయ్యాలి. అంటే వెండి / రాగి చెంబు లో నీళ్లు పోసి, చుటూత నాలుగు చోట్ల గంధం, బొట్టు పెట్టి, పసుపు, అక్షంతలు, పూలతో అలంకరించి, కలశ పూజ చెయ్యాలి.
  7. గణపతి పూజ
    కలశ పూజ తరువాత పసుపు గణపతికి యదా విధి పూజ చెయ్యాలి. ఆ తరువాత పసుపు గణపతి కి ఉద్వాసన చెప్పాలి
  8. ప్రాణ ప్రతిష్ఠ
    పసుపుతో చేసిన అమ్మవారిని తమలపాకు పైన ఉంచి, పసుపు కుంకుమల తో, గంధంతో, పువ్వుల తో పూజించాలి.
  9. షోడశోపచార పూజ
    ప్రాణ ప్రతిష్ఠ తరువాత అమ్మవారికి షోడశోపచార పూజ చెయ్యాలి. షోడశోపచారం అంటే ముందుగా అమ్మవారిని మనసుపూర్తిగా ధ్యానించి ఆవాహనం చేయాలి. ఆ తరువాత ఆసనం సమర్పించి, అర్ఘ్య పాద్యాలు సమర్పించి ఆచమనీయం చెయ్యాలి. తరువాత పంచామృత స్నానం మరియు శుద్ధోదక స్నానం చేసి వస్త్రం, ఆభరణం సమర్పించి, గౌరీ అష్టోత్తర శతనామావళి చదువుతూ గంధం, అక్షంతలు, పుష్పాలతో అమ్మవారిని పూజించాలి.
ఆ తరువాత ధూపం, దీపం సమర్పించి, అమ్మవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించాలి. చివరికి అమ్మవారికి మంగళ హారతి ఇవ్వాలి. హారతి అయ్యాక, వరిపింది జ్యోతులు వెలిగించి, మంగళ గౌరీ వ్రత కధ చదువుతూ, అట్లకాడ / కత్తి జ్యోతుల పైన పట్టుకొని ఉంచి కాటుక పట్టాలి. కధ పూర్తయ్యాక అమ్మవారికి వాయనం ఇఛ్చి, తోరం కుడిచేతికి కట్టుకోవాలి. ఆ తరువాత ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి.

ఆ తరువాత ధూపం, దీపం సమర్పించి, అమ్మవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించాలి. చివరికి అమ్మవారికి మంగళ హారతి ఇవ్వాలి. హారతి అయ్యాక, వరిపింది జ్యోతులు వెలిగించి, మంగళ గౌరీ వ్రత కధ చదువుతూ, అట్లకాడ / కత్తి జ్యోతుల పైన పట్టుకొని ఉంచి కాటుక పట్టాలి. కధ పూర్తయ్యాక అమ్మవారికి వాయనం ఇఛ్చి, తోరం కుడిచేతికి కట్టుకోవాలి. ఆ తరువాత ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి.

Comments