Skip to main content

Lyrics Of Ramadasu Keertana Idigo Bhadradri In Telugu

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2
ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి యుండేది
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2

చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండేది
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2

అనుపమానమై అతిసుందరమై దనరు చక్రము ధగ ధగ మెరిసెడి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2

కలియుగమందున ఇలవైకుంఠమునలరు చున్నది నయముగ మ్రొక్కెడి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2

పొన్నల పొగడల పూ పొదరిండ్లను చెన్ను మీగడను  శృంగారాంబడు
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2

శ్రీకరముగ రామదాసును ప్రకటముగ బ్రోచే ప్రభు వశము
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ - 2

Comments